నీట్ పేపర్ లీకేజీపై రాజ్యసభలో మల్లిఖార్జున్ ఖర్గే ఆందోళన
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. అయితే ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటలకు వరకు వాయిదా పడ్డాయి. వివిధ అంశాలపై విపక్షాలు లోక్‌సభలో ఆందోళన చేశాయి. నీట్ పేపర్ లీకేజీ, అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ అంశాలపై విపక్ష సభ్యులు నినాదాలు చేశాయి. ప్రశ్నోత్తరాల సమయాన్ని విపక్షాలు అడ్డుకున్నాయి. కానీ విపక్ష సభ్యులు మాత్రం తమ నినాదాలను ఆపలేదు. దీంతో స్పీకర్ ఓం బిర్లా అసహనానికి గురయ్యారు. సభలో మొదటి రోజే ఇలా సాగితే అది చెడు సంప్రదాయాన్ని సూచిస్తుందని అన్నారు. ఆయన సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.