అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడి.. మహిళల జుట్టు కత్తిరిస్తున్న ఆగంతకుడు

ఒక ఆగంతకుడు అర్ధరాత్రి వేళ ఇళ్లలోకి చొరబడుతున్నాడు. నిద్రిస్తున్న మహిళల జుట్టు కత్తిరిస్తున్నాడు. వరుసగా రెండు సంఘటనలు జరుగడంతో ఆ గ్రామస్తులు భయందోళన చెందుతున్నారు. (intruder cut women’s hair) బీహార్‌లోని దర్భంగా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూలై 16న దర్హార్ గ్రామంలో రాత్రివేళ నల్లటి దుస్తులు ధరించిన వ్యక్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. నిద్రిస్తున్న ఒక మహిళ జుట్టు కత్తిరించాడు. అలికిడికి ఆమె మేల్కోగా ఆ వ్యక్తి చీకటిలో మాయమయ్యాడు. కాగా, నేలపై కత్తిరించిన జుట్టు, కత్తెర ఉండటంతో పాటు ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి ఆ మహిళ షాక్‌ అయ్యింది. తన కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పింది....