త‌ల‌కు చిన్న‌పాటి గాయ‌మైన స‌రే అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిందే..

రోజువారీ పనుల‌కు ఇబ్బంది.. ఇవే కాకుండా తలనొప్పి, తల తిరగడం, అలసట, కాంతి లేదా శబ్దానికి అధిక సున్నితత్వం వంటి సమస్యలు కూడా చాలా రోజుల పాటు కొనసాగే అవ‌కాశాలు ఉంటాయి. ఇవి రోజువారీ పనులు, ఉద్యోగం, వ్యక్తిగత జీవితంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. తలకు గాయం ప్రభావం కేవలం శారీరక సమస్యలకే పరిమితం కాదు. గతంలో తలకు గాయం అయిన వారిలో డిప్రెషన్, ఆందోళన, మూడ్ డిజార్డర్లు, నిద్ర సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి. కొందరిలో వ్యక్తిత్వ మార్పులు, చిరాకు, భావోద్వేగాలను నియంత్రించడంలో ఇబ్బందులు, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు కూడా కనిపిస్తాయి....