ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్స్ కు సంక్షేమ బోర్డు ని ఏర్పాటు చేయాలి.

- టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఎస్ కిరణ్ నారాయణపేట, జూలై 17 (బి వి కే న్యూస్) ప్రగతిశీల ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్స్ యూనియన్ అనుబంధం టి యు సి ఐ జనరల్ బాడీ సమావేశం శుక్రవారం టి యు సి ఐ జిల్లా అధ్యక్షుడు ఎస్ కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి రఘు అధ్యక్షత వహించగా టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఎస్ కిరణ్  ప్రసంగిస్తూ ప్రైవేట్  స్కూల్  బస్సు డ్రైవర్ కు చట్ట ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరారు. సీట్ కెపాసిటీకి మించి విద్యార్థులని ఎక్కించిన బాధ్యత తోటి విద్యార్థులను పాఠశాలకు చేర్పించడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పనికి...