స్థానిక ఎన్నికల్లో 2024 ఫార్ములా వర్తించదు, జనసేన సత్తా చాటుతాం- మనోహర్..!!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీలు సిద్దం అవుతున్నాయి. కూటమి నేతలు ఇప్పటికే ఈ ఎన్నికల కోసం కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ఇప్పటికే సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకొని క్షేత్ర స్థాయిలో కూటమి విజయం కోసం పని చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం సీట్ల కేటాయింపు పైన కొత్త ఫార్ములా సిద్దం చేసినట్లు చెబుతున్నారు. కాగా.. స్థానిక ఎన్నికల్లో తమ పార్టీకి సీట్ల పైన మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేసారు. మంత్రి మనోహర్ స్థానిక ఎన్నికల పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. జనసేన బలాబలాలను బట్టి పోటీ చేస్తామని మంత్రి మనోహర్ స్పష్టం చేసారు. కూటమి బలోపేతమే ప్రధాన లక్ష్యంగా ఉంటుందని...