LIC పాలసీదారులకు షాక్..
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) కస్టమర్లకు గట్టి షాక్ తగిలింది. ఇకపై క్రెడిట్ కార్డుల ద్వారా ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌లో నేరుగా ప్రీమియం చెల్లించే సదుపాయాన్ని సంస్థ నిలిపివేసింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే సైలెంట్‌గా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 15 రోజుల క్రితమే తన అధికారిక కస్టమర్ పోర్టల్, మొబైల్ యాప్ నుంచి క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఆప్షన్‌ను ఎల్‌ఐసీ పూర్తిగా తొలగించింది. ప్రస్తుతం వెబ్‌సైట్‌లో కేవలం నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, యూపీఐ (UPI) మార్గాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భారం తట్టుకోలేకేనా? సాధారణంగా గూగుల్ పే, ఫోన్‌పే వంటి ఇతర యాప్స్‌లో క్రెడిట్ కార్డ్‌తో ఎల్‌ఐసీ...