బిందు సేద్యంపై నీలినీడలు
ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటాయి. వాణిజ్య పంటలు సాగు చేస్తున్న రైతులకు ఆశించిన మేరకు దిగుబడి రావడం లేదు. కొంతమంది రైతులు కాలానికి అనుగుణంగా ఉన్న కొద్దిపాటి నీటితోనైనా ఆరుతడి పంటలను సాగు చేసుకునేందుకు శ్రమిస్తున్నారు. అయితే బిందు సేద్యానికి ప్రతి ఏటా ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నా రైతులకు అందడం కావడం లేదు. ఆయిల్ పామ్‌ను సాగును చేసే రైతులకు మాత్రమే అధికారులు సబ్సిడీపై డ్రిప్ పరి కరాలు అందిస్తున్నారు. మిగతా పంటలైన కూర గాయలు, పండ్లతోటలు, ఆకుకూరలు, పత్తి, మిర్చి, మొక్కజొన్న, పప్పు దినుసుల పంటలకు అవసర మయ్యే బిందు సేద్యం పరికరాలు అందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు....