వానాకాలం.. జాగ్రత్త! ఈ చిట్కాలతో వ్యాధులకు చెక్ పెట్టండి

వర్షాకాలం రానే వచ్చింది. ఈ సమయంలో వాతావరణంలో అనేక రకాల మార్పులు రావడంతో పాటు, మన శరీరంలో కూడా కొన్ని మార్పులు జరుగుతుంటాయి. ఉష్ణోగ్రతల్లో వచ్చే తీవ్రమైన హెచ్చుతగ్గుల కారణంగా రోజురోజుకీ ఆరోగ్య సమస్యలు పెరుగుతుంటాయి. మన శరీరం సులభంగా బ్యాక్టీరియా, వైరల్ దాడులకు గురవుతుంది. ఈ సీజన్‌లో అంటువ్యాధుల గురించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా జలుబు, జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్లు సర్వ సాధారణంగా వేధిస్తుంటాయి. వీటి బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే. కాచి చల్లార్చిన నీటినే తాగాలి: వర్షాకాలంలో తాగే నీరు కలుషితమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నీటిని బాగా మరిగించి, ఫిల్టర్ చేసుకుని తాగడం వల్ల డయేరియా...