9వ తరగతిలో మూడో భాష వద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన..

9వ తరగతి విద్యార్థులకు మూడో భాషను తప్పనిసరి చేయడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. బోర్డు పరీక్షలకు పునాది వేసే ఈ దశలో కొత్త భాషను ప్రవేశపెట్టడం విద్యార్థులపై అదనపు ఒత్తిడిని పెంచుతుందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో 9వ తరగతిలో మూడో భాషను ప్రవేశపెట్టవద్దని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది (CBSE third language policy). సీబీఎస్ఈ అమలు చేస్తున్న మూడు భాషల విధానాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కొత్త భాషను నేర్చుకోవడం మంచిదేనని, అయితే బోర్డు పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయంలో విద్యార్థులపై అదనపు భారం వేయడం సమంజసం కాదని అభిప్రాయపడింది. కొత్త భాషను చిన్న తరగతుల...