గత 225 ఏళ్లలో.. ఢిల్లీలో 89 శాతం తగ్గిన యమునా నది ప్రవాహం
దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ప్రవహిస్తున్న విషయం తెలిసిందే. అయితే గడిచిన రెండు శతాబ్దాల్లో యమునా నది ప్రవాహం, వెడల్పు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన జియోగ్రఫీ శాఖ, భోపాల్‌లోని సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ ఇన్స్‌టిట్యూట్ దీనిపై ఓ నివేదికను రిలీజ్ చేసింది. ఒకవైపు ఢిల్లీ నగరం విస్తరిస్తుండగా, యమునా నది మాత్రం ఆ సిటీ సమీపంలో క్షీణిస్తున్నట్లు పేర్కొన్నారు. 1799 నాటి మ్యాప్ ఆధారంగా ఈ అంచనా వేశారు. శాటిలైట్ ఇమేజ్‌లు, చారిత్రక రికార్డులను అధ్యయనం చేశారు. గడిచిన 225 ఏళ్లలో యమునా నది ఢిల్లీ సమీపంలో 68 శాతం తన వెడల్పును కోల్పోయిందని, ఇక సిటీకి ఆ...