‘కార్పొరేట్ మిత్ర’ పథకం..
దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME)లకు తక్కువ ఖర్చుతో వృత్తిపరమైన సేవలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన పథకం ‘కార్పొరేట్ మిత్ర’. దీని ద్వారా శిక్షణ పొందిన నిపుణులు చిన్న వ్యాపారాలకు ఆర్థిక, అకౌంటింగ్, చట్టపరమైన విషయాల్లో సహాయం చేస్తారు. ఉద్యోగాల సాధన దిశగా యువతను ప్రోత్సహించడానికి, ఎంఎస్ఎంఈ (MSME) రంగ బలోపేతానికి కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా శిక్షణ పొందిన పారా-ప్రొఫెషనల్స్ పూల్‌ను తయారుచేసే లక్ష్యంతో ‘కార్పొరేట్ మిత్ర’ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌కు నోటిఫికేషన్ విడుదలైంది. దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ICAI, ICSI, ICMAI ల అకాడమిక్ భాగస్వామ్యంతో, IIT మద్రాస్ (Swayam...