మిగిలిపోయిన ఆహారాన్ని వేడి చేసి తింటున్నారా..
మిగిలిపోయిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తినడం చాలా మందికి రోజువారీ అలవాటు. ఇలా చేయడం వల్ల సమయం ఆదా కావడంతోపాటు ఆహార వృథా కూడా తగ్గుతుంది. అయితే వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసే విధానం కూడా వంట చేసినంతే ముఖ్యమని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) సూచిస్తోంది. సరైన పద్ధతిలో వేడి చేయకపోతే ఆహారంలో బ్యాక్టీరియా పెరిగి ఫుడ్ పాయిజనింగ్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. చాలామంది క్రితం రోజు కూర లేదా పప్పును వేడి చేస్తూ దానిలో తాజాగా వండిన కూర లేదా పప్పును కలిపేస్తుంటారు. అయితే ఇలా చేయకూడదని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సూచిస్తోంది. తాజాగా...