మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు హౌస్ అరెస్ట్
బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపు మేరకు రైతుల సమస్యలపై నిరసనకు సిద్ధమైన అశ్వారావుపేట నియోజకవర్గ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి స్టేషన్‌కు తరలించగా, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును దమ్మపేట తాటిసుబ్బన్నగూడెంలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ పిరికిపంద చర్య అన్నారు. ఉప ముఖ్యమంత్రితో సహా మంత్రుల దండు మణుగూరు వస్తుంటే, రైతుల సమస్యలపై ప్రశ్నిస్తారనే వణుకు ఎందుకు పట్టుకుందని, అధికారంలోకి రాకముందు ఆకాశం నుంచి అమృతం తెస్తామన్న కాంగ్రెస్ నాయకులు, తీరా గద్దెనెక్కాక రైతుల కష్టాలు అడిగితే పోలీసులతో అరెస్టులు...