20 కార్ల‌లో బిల్డింగ్ సైట్‌కు.. వాటా ఇవ్వాల‌ని కాంట్రాక్ట‌ర్‌కు బెదిరింపు..

.గురుగ్రామ్‌(Gurugram)లో ఓ ముఠా బెదిరింపుల‌కు పాల్ప‌డింది. కౌశ‌ల్ చ‌ద‌రీ గ్యాంగ్‌కు చెందిన సుమారు 50 మంది ఆయుధాల‌తో వ‌చ్చి ఓ కాంట్రాక్ట‌ర్‌ను బెదిరించారు. దాదాపు 20 వాహ‌నాల్లో బిల్డింగ్ నిర్మిస్తున్న ప్ర‌దేశానికి వాళ్లు చేరుకున్నారు. ఒక‌వేళ వాటా ఇవ్వ‌కుంటే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. కాంట్రాక్ట‌ర్ మ‌నీశ్ ద‌హియా సెక్టార్ 108 పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. త‌న‌కు, త‌న ఫ్యామిలీకి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరాడు. ధావ‌న్‌పూర్‌లో ఉన్న వ‌ర్క్‌సైట్‌లో ఈ ఘ‌ట‌న జూలై 15వ తేదీన జ‌రిగింది. బెదిరింపుల‌కు పాల్ప‌డిన ఆ ముఠా.. సుమారు 20 వాహ‌నాల్లో సైట్‌కు చేరుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌హేంద్ర స్కార్పియో వాహ‌నాల్లో ఆ గ్యాంగ్ వ‌చ్చింది. సైట్ వ‌ద్ద కాన్వాయ్‌కి...