భట్టికి ఇరిగేషన్‌లో ఓనమాలు తెలియవు ..ఆయన సమైక్యవాది
బీఆర్‌ఎస్ నాయకుడు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Former Minister Niranjan Reddy ) కాంగ్రెస్ మంత్రులపై విరుచుకుపడ్డారు. ఇరిగేషన్ విషయంలో రాష్ట్ర మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( Minister Batti Vikramarka ) కు ఓనమాలు తెలియవని, ఆయన సమైక్యవాది అని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకార పూరిత ధోరణితో ఉన్నారని విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో పాలమూరు రెండు తరాల జీవితాలను కోల్పోయిందని వెల్లడించారు. జలయజ్ఞంలో పాలమూరు ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని, కాంగ్రెస్ , టీడీపీ కలిసి 26 ఏళ్లలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ. 2,600...