పూరీలో ఘ‌నంగా మొద‌లైన జ‌గ‌న్నాథ్ ర‌థ‌యాత్ర‌..

ఒడిశా (Odisha) లోని పూరీ క్షేత్రంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జగన్నాథ రథయాత్ర (Jagannath Rath Yatra) ఇవాళ ఘ‌నంగా ప్రారంభమైంది. ఈ ర‌థ‌యాత్రా మహోత్సవంలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు తరలివచ్చారు. జగన్నాథుడు (Lord Jagannath), బలభద్రుడు (BalaBhadra), సుభద్రా దేవి (Subhdra Devi) కొలువై ఉన్న రథాలను లాగేందుకు భక్తులు పోటీపడ్డారు.‘జై జగన్నాథ్’ నినాదాలతో పూరీ వీధులు మారుమోగాయి. ఏడాదికి ఒకసారి గర్భగుడి నుంచి బయటకు వచ్చి గుండిచా ఆలయంలోని తన అత్తవారింటికి వెళ్లే జగన్నాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ యాత్ర భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ...