దేవరకొండ మున్సిపాలిటీలో ‘జల్ సంచయ్ జన భాగీదారి 3.0’ - వర్షపు నీటి సంరక్షణపై అవగాహన సదస్సు.
దేవరకొండ 14జూలై (BVK 3 న్యూస్ ) : మున్సిపల్ పరిపాలనా ప్రాంతీయ సంచాలకులు (సిడిఎంఏ ) గారి ఆదేశాల మేరకు, జల శక్తి అభియాన్‌లో భాగంగా చేపట్టిన ‘జల్ సంచయ్ జన భాగీదారి 3.0’ ప్రచార కార్యక్రమంలో భాగంగా, మంగళవారం దేవరకొండ మున్సిపల్ కార్యాలయంలో వర్షపు నీటి సంరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలోని వర్షపు నీటి నిల్వ గుంతల వద్ద , వర్షపు నీటిని ఒడిసి పట్టడం, భూగర్భ జలాల పునరుద్ధరణ మరియు సుస్థిర జల నిర్వహణ ఆవశ్యకతపై మున్సిపల్ సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం, నీటిని పొదుపుగా వాడుకుంటూ, భవిష్యత్ తరాల కోసం జల సంరక్షణ చేస్తామని...