దేవరకొండలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్: పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్

దేవరకొండ 14జూలై (BVK 3 న్యూస్ ) : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) దేవరకొండ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు మరియు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దేవరకొండ డివిజన్ పరిధిలోని పలు కళాశాలల్లో బంద్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ యలమల గోపీచంద్ మాట్లాడుతూ , పేద, మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత విద్యకు స్కాలర్‌షిప్‌లు మరియు ఫీజు రీయింబర్స్‌మెంట్ అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కారణంగా వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన...