తండ్రి విజయ్ కోసం కుమారుడి త్యాగం..

తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జననాయగన్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోంది. సెన్సార్ వివాదాల కారణంగా గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఎట్టకేలకు సెన్సార్ పూర్తి చేసుకోవ‌డంతో త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. అయితే విజ‌య్ సినిమా వ‌స్తుండ‌టంతో ప‌లు సినిమాలు ఇప్ప‌టికే వాయిదా ప‌డుతున్నాయి. కొన్ని చిత్రాలు తమ విడుదల తేదీలను మార్చుకుంటున్నాయి. ఈ క్రమంలోనే విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ కూడా తన తండ్రి సినిమా కోసం వెనక్కి తగ్గినట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న హై-వోల్టేజ్ హీస్ట్ ఎంటర్‌టైనర్...