ప్రజలకు సురక్షితమైన రవాణా వ్యవస్థను అందించడమే ప్రభుత్వ లక్ష్యం

మక్తల్ సభలో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. మక్తల్ నియోజక వర్గంలో రూ. 573.28 కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులకు జిల్లా మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి తో కలిసి శంకుస్థాపన చేసిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నారాయణపేట, జూలై 13 (బివికే న్యూస్) రాష్ట్ర ప్రజలకు సురక్షితమైన రవాణా వ్యవస్థను అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మక్తల్ నియోజకవర్గంలో హ్యామ్ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమం కోసం విచ్చేసిన రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గార్లకు...