ఇరాన్‌పై అమెరికా ముప్పేట దాడులు..
అమెరికా, ఇరాన్ (USA, Iran) దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో వాణిజ్య నౌకలపై ఇరాన్ (Iran) దాడులకు పాల్పడటంతో.. అమెరికా భారీ ఎత్తున ప్రతీకార దాడులు చేస్తోంది. గడిచిన 24 గంటల్లో మూడోసారి దాడులకు పాల్పడింది. దీన్నిబట్టి అక్కడి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. తాజా పరిణామాలతో గల్ఫ్ ప్రాంతం (Gulf region) లో యుద్ధ వాతావరణం నెలకొన్నది. అంతర్జాతీయ సమాజంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే పౌర, వాణిజ్య నౌకలపై దాడులు చేసే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకే ఈ దాడులు నిర్వహిస్తున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ప్రకటించింది....