బాక్సాఫీస్ షేక్ చేసిన ‘లెనిన్’..
అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన లేటెస్ట్ రూరల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్‌తో దూసుకుపోతోంది. మొదటి రోజే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో, అఖిల్ కెరీర్‌లోనే బెస్ట్ ఫస్ట్ డే వసూళ్లను సొంతం చేసుకుంది. చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.16.7 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద ఘనమైన విజయాన్ని నమోదు చేసింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమాకు ఇండియా నెట్ కలెక్షన్స్ దాదాపు రూ.5.90 కోట్లు, ఇండియా గ్రాస్ కలెక్షన్స్ దాదాపు రూ.6.73 కోట్లు, అలాగే ఓవర్సీస్ గ్రాస్...