ఫిఫా ప్రపంచ కప్‌పై అమితాబ్ బచ్చన్ ప్రశ్న..
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్టు ఫుట్‌బాల్ అభిమానుల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఫిఫా ప్రపంచకప్ 2026లో మొరాకో జట్టుకు సంబంధించి వస్తోన్న ఓ వార్త గురించి ఆయన చాట్‌జీపీటీని అడిగారు. అయితే చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దానికి సంబంధించిన విషయాన్ని బిగ్‌బీ అభిమానులతో పంచుకున్నారు. ‘ఫిఫా ప్రపంచ కప్ 2026లో మొరాకో జట్టులోని ప్లేయర్లు ఒక్కరూ ఆ దేశంలో పుట్టలేదని ఎవరో చెప్పారు. అదే విషయాన్ని చాట్‌జీపీటీని అడిగితే.. అది పూర్తిగా నిజం కాదని సమాధానం ఇచ్చింది’ అని అమితాబ్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఇప్పుడు ఇది నెట్టింట తెగ...