100 ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్..
ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) గుడ్ న్యూస్ చెప్పింది. 2026-27 విద్యా సంవత్సరానికి అదనంగా 100 ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కడప ప్రభుత్వ వైద్య కళాశాలకు 75 సీట్లు, నెల్లూరులోని ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు 25 సీట్ల పెంపునకు ఎన్‌ఎంసీ లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్‌ఓపీ) జారీ చేసింది. ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఇవాళ (శుక్రవారం) వివరాలు వెల్లడించారు. తాజా అనుమతులతో ఏపీలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మరో 100 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయని మంత్రి సత్య కుమార్ తెలిపారు. వైద్య...