కీల‌క రైల్వే వంతెన‌పై అమెరికా దాడి..

ఈ క్రమంలో ఇరాన్ (Iran), చైనా (China), రష్యా (Russia) దేశాల మధ్య భూమార్గం ద్వారా జరిగే వ్యూహాత్మక వస్తు రవాణాకు కీలకంగా భావించే ఆక్ తఖే ఖాన్ రైల్వే బ్రిడ్జి (Ralway Bridge) పై అమెరికా వైమానిక దళం (US Airforce) క్షిపణి దాడి చేసినట్లు అంతర్జాతీయ కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్ ఉత్తర ప్రాంతంలోని గొలిస్తాన్ ప్రావిన్స్‌లో ఉన్న ఈ రైల్వే వంతెన చైనా-తుర్క్‌మెనిస్తాన్-ఇరాన్ రైల్వే కారిడార్‌లో అత్యంత కీలకమైన భాగం. అమెరికా విధించిన ఆంక్షలు, ఇరాన్ సముద్ర రేవులపై ఉన్న పరిమితుల కారణంగా.. ఇరాన్, రష్యా, చైనా దేశాలు ఆయుధాలు, ముడి చమురు, ఇతర సరుకుల రవాణాకు ఈ ప్రత్యామ్నాయ రైలుమార్గాన్ని...