విజయవంతమైన రక్తదాన శిబిరం....

రక్తదానం చేసిన 32 మంది యువకులు నారాయణపేట, జూలై 9 (బివికె న్యూస్) తెలంగాణ రాష్ట్ర సాధనలో నా రక్తం నా తెలంగాణ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఎబివిపి నిర్వహించిన సేవా పోరాట కార్యక్రమాల కొనసాగింపుగా ABVP ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మఖ్తల్ మార్కెట్ యార్డ్ లో గురువారం నిర్వహించిన రక్త దాన శిబిరం విజయవంతమైనది . ఇట్టి రక్తదాన శిబిరంలో 32 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బిజెపి కార్యాలయ సభ్యులు కొండయ్య మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానం అని పునరుద్ఘాటించారు కొండయ్య. శరీరంలోని ప్రతి అవయవానికి అవసరమైన ఆక్సిజన్, పోషకాలను అందించడంలో రక్తం కీలక పాత్ర పోషిస్తుందన్నారు...