దేవరకొండలో అట్టహాసంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం మరియు జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు
దేవరకొండ 09జూలై (BVK 3 న్యూస్ ) : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) దేవరకొండ శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవం మరియు 78వ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా దేవరకొండ గౌడ్ బాయ్స్ హై స్కూల్ నుంచి జడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్ మైదానం వరకు విద్యార్థులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించి,ఏబీవీపీ జెండాను ఆవిష్కరించారు. ర్యాలీలో దేశభక్తి నినాదాలు, విద్యార్థి చైతన్యాన్ని ప్రతిబింబించే నినాదాలతో దేవరకొండ పట్టణం మార్మోగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ యలమల గోపీచంద్ గారు మాట్లాడుతూ 1949 జూలై 9న ఆవిర్భవించిన అఖిల...