సింగరేణి బకాయిలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తాం

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ కౌంటర్ ఇచ్చారు. తాడిచర్ల-2 గని కేటాయింపు పూర్తిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృషి ఫలితమేనని అన్నారు. యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ తాడిచర్ల-2 బొగ్గు గనిని సింగరేణికి కేటాయించలేకపోయిందని విమర్శించారు. సింగరేణికి మీరేం చేశారని భట్టి విక్రమార్కను ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డగా, సింగరేణి కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ గనిని సింగరేణికి కేటాయింపునకు కృషి చేశారని పేర్కొన్నారు. తాడిచర్ల గని కేటాయింపును సింగరేణి కార్మిక సంఘాలు స్వాగతిస్తూ ప్రధాని మోదీ, కిషన్ రెడ్డికి పాలాభిషేకాలు...