ఎయిడ్స్ నియంత్రణలో భేష్..‘వికారాబాద్’కు జాతీయ స్థాయి గుర్తింపు
హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నివారణ, నియంత్రణ, చికిత్సలో విశిష్ట పనితీరు కనబర్చినందుకు వికారాబాద్ జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధించినందుకు గాను సక్షం సర్టిఫికెట్ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా కేవలం 70 జిల్లాలు మాత్రమే భారత ప్రభుత్వం, జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నిర్దేశించిన ప్రమాణాలను పూర్తి చేయగా, వాటిలో వికారాబాద్ జిల్లాకు చోటు దక్కింది. జిల్లాలో హెచ్‌ఐవీతో జీవిస్తున్న వ్యక్తుల్లో కనీసం 95 శాతం మందికి తమ స్థితిని గుర్తించే లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 4,536 మంది హెచ్‌ఐవీ బాధితులను గుర్తించి వారందరికీ ఉచితంగా యాంటీ రెట్రో వైరల్ థెరఫీ అందిస్తున్నట్లు వెల్లడించారు....