బడుల మూత తిరోగమనం.. సీఎం రేవంత్‌రెడ్డికి 125 మంది మేధావుల బహిరంగ లేఖ
రాష్ట్రంలోని 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000కు కుదింపుపై చేసిన ప్రకటనను పునఃసమీక్షించాలని, 23,000 బడుల మూసివేత ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని విజ్ఞప్తి “జూన్ 6వ తేదీన మీరు బెంగళూరులో ది హిందూ పత్రిక నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని 27,000 ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను 4,000కు కుదించి, మిగిలిన బడులను మూసివేస్తామని చేసిన ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు, మేధావులు, తల్లిదండ్రులు, పౌరసమాజంలో తీవ్ర ఆందోళనను కలిగించింది. ఈ నిర్ణయం వల్ల సంభవించబోయే ప్రమాదకరమైన విద్య, సామాజిక పరిణామాలను మీ దృష్టికి తీసుకురావడానికే ఈ బహిరంగ లేఖను సమర్పిస్తున్నాము.Geographic Reference 1. విద్యాహక్కు చట్టం ఉల్లంఘన: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ఏ, విద్యాహక్కు...