ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో రిగ్గింగ్‌..

తాజాగా జ‌రుగుతున్న ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్న‌మెంట్ రిగ్గింగ్‌కు గురైన‌ట్లు ఈజిప్ట్ కోచ్ హోస‌మ్ హ‌స‌న్(Egypt Coach Hassan ) సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. అర్జెంటీనా కోసం, మెస్సీ కోసం.. ఫిఫా ఆ టోర్నీ నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆయ‌న విమ‌ర్శించారు. అట్లాంటా స్టేడియంలో మంగ‌ళ‌వారం జ‌రిగిన థ్రిల్ల‌ర్ మ్యాచ్‌లో అర్జెంటీనా 3-2 గోల్స్ తేడాతో విజ‌యం సాధించి క్వార్ట‌ర్స్‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. దాదాపు ఓట‌మి అంచు నుంచి అర్జెంటీనా అనూహ్య రీతిలో విక్ట‌రీని న‌మోదు చేసింది. ఓ ద‌శ‌లో 0-2 గోల్స్ తేడాతో వెనుక‌బ‌డ్డ అర్జెంటీనా.. ఆఖ‌రి 13 నిమిషాల్లో మ్యాచ్ స్వ‌రూపాన్నే మార్చేసింది. రోమిరో, మెస్సీ, ఫెర్నాండేజ్ చ‌క‌చ‌కా గోల్స్ చేయ‌డంతో.. ఈజిప్ట్ షాక్‌కు గురైంది....