జూపల్లి VS సీఎం రేవంత్ .. మంత్రి కూరలో కరివేపాకు అంటూ మీడియాలో కథనాలు

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, కొంతమంది మంత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండేలా విభేదాలు కొనసాగుతున్నాయి. సీఎం ఏక పక్ష నిర్ణయాలతో మంత్రులు కుతకుత ఉడికిపోతున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య వివాదాలు ముదిరి పాకానపడ్డాయి. సంబంధిత మంత్రి జూపల్లి లేకుండానే పర్యాటక శాఖపై రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. తనకు చెప్పకుండా సొంత శాఖపై రేవంత్ రెడ్డి సమీక్ష చేయడంపై జూపల్లి సీరియస్ అయ్యారు. వెంటనే అధికారులకు ఫోన్ చేసి రేవంత్ సమీక్షపై వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో జూపల్లి ‘కూరలో కరివేపాకు’ అంటూ రేవంత్ రెడ్డి మీడియా...