సింగరేణిలో బొగ్గు బ్లాకుల కోసం పోరాడింది మేమే..
తాడిచెర్ల బ్లాక్–2ను సింగరేణికి తామే కేటాయించామని బీజేపీ–కాంగ్రెస్ కొత్త నాటకానికి తెరతీశారని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) తీవ్రంగా విమర్శించారు. సింగరేణిలో జరుగుతున్న అక్రమాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడేందుకే తాడిచెర్ల బ్లాక్–2ను కేటాయించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ప్రకటించారనే అనుమానాలు కలుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.Executive Branch కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలను కాపాడేందుకు బీజేపీ కేంద్ర మంత్రులు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కొప్పుల అన్నారు. తాడిచెర్ల బ్లాక్–2 మాత్రమే కాదు, మిగిలిన అన్ని బొగ్గు బ్లాక్‌లను కూడా సింగరేణికే కేటాయించాలని బీఆర్ఎస్, టీబీజీకేఎస్ డిమాండ్ చేస్తున్నాయని మాజీ మంత్రి...