రాధాగాయత్రి కేసులో కీలక మలుపు..

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాధాగాయత్రి తన భర్తతో కలిసి ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీకి ట్రిప్‌నకి వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాధాగాయత్రి మృతిపై కేసు (Radha Gayatri case) నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమార్తె మృతికి అల్లుడు శ్రీచరణ్ కారణం అంటూ ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే, ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పూర్తిస్థాయి నిజానిజాలు వెలికితీసేందుకు డెహ్రాడూన్ జిల్లా కలెక్టర్ రాహుల్ ఆనంద్ (Rahul Anand) మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. ఈ నిర్ణయంతో కేసు దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. మసూరిలో జూన్ 14వ తేదీ నుంచి 16వ తేదీల మధ్య అసలు...