డిప్యూటీ సీఎం పవన్‌తో సమావేశమైన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు..
ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపడుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. అమరావతిలో ఇవాళ (మంగళవారం) ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ అంత్రపెన్యూర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులను ఆప్యాయంగా పలకరించిన పవన్ కల్యాణ్.. వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఓపికగా విని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో పారిశ్రామికవేత్తలు సబ్సిడీల విడుదలలో తీవ్ర జాప్యం, పరిశ్రమల నిర్వహణకు సంబంధించిన పలు సమస్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం.. ఎస్సీ, ఎస్టీ అంత్రపెన్యూర్స్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని...