ఓ యువతా మేలుకో
సాధన పథం విజయరథం ఓ యువత మేలుకో నీ గమ్యం చేరుకో అనుకున్న లక్ష్య సాధనకు ముందడుగు వేయి ధైర్యమే ఆయుధంగా సాహసమే ఊపిరిగా ఫలితాల పైదృష్టి పెట్టు అలసట పక్కన పెట్టు పట్టుదల నీ పెట్టుబడి కావాలి ప్రగతి పురోగతి నీ దారి కావాలి జీవితంలో చాలా విషయాలు నేర్చుకోవడం సులభమే కాని వాటిలో నైపుణ్యం సాధించడమే కష్టం నైపుణ్యానికి అడ్డు కట్ట వేసేది పనితనం పట్టుదల లోపించడం నిరాశ నిస్పృహలు వాయిదా తత్వం అభివృద్ధికి నిరోధక శక్తులౌతాయి నిరంతర సాధన అందరికంటే నిన్ను ఉత్తమునిగా నిలుపుతుంది నిరంతర సాధనతో నీ చరిత్ర నువ్వే రాసుకోవాలి మొదటిసారీ తడబడితే భయపడకు ఓటమి ఎదురైతే వెనకడుగు...