🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 05 Jul, 2026 | Page: 1

ఒక ప్రభుత్వంతో పోరాడేంత బలం మాకు లేదు

యూట్యూబర్ రావణ్‌గా ప్రజలకు పరిచయమున్న నా భర్తపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఆ వీడియో కల్పిత వీడియో. అది సృష్టించిన వీడియో. తమ తప్పులను సమర్థించుకునేందుకు లేని వీడియోను సృష్టిస్తూ ఈ తప్పుడు ప్రచారానికి దిగారు. వీటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని బచ్చలకూర అనూష పేర్కొంది. ఈ మేరకు ఆమె ఓ పత్రికా ప్రకటన చేసింది.
రావణ్ కులాన్ని కూడా వక్రీకరిస్తూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కులాలకు, మతాల పేరిట జరిగే విద్వేషాలకు మా కుటుంబం వ్యతిరేకం. అయినా సరే ప్రజలకు వాస్తవాలు చేరాలి కాబట్టి, నా భర్తది “కమ్మ కులం”. నా భర్త పేరు కూడా అధికారికంగా రావణే. రావణ్ పలానా పార్టీ, పలానా వర్గం అంటూ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం. మాకు ఏ పార్టీలతో సంబంధాలు లేవని స్పష్టం చేసింది.
గొంతులేని వర్గాలకు ఒక గొంతుగా నిలవడమే రావణ్ పార్టీ. అదే వర్గానికి చెందిన రావణ్. సమాజంలో మంచి మార్పు రావాలని, రాజ్యాంగం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలన్న సిద్ధాంతమే రావణ్‌ది తప్ప, ఏ ఒక్కరినీ కించపరచాలని, ఎవ్వరినీ నొప్పించాలని కాదు. ఒక ప్రజాస్వామ్యవాదిగా ప్రశ్నిస్తాడు. గట్టిగానే ప్రశ్నిస్తాడు. ప్రశ్నించడం అతని నైజం. బాధ్యత కలిగిన వారు వాటికి సమాధానాలు ఉంటే చెప్పాలి, లేదంటే లోపాలను సరిదిద్దుకోవాలి. అంతేకాని, ఇలా చట్టవ్యతిరేకంగా నడుచుకోవడం అన్యాయమని అనూష ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం ప్రశ్నిస్తున్నందుకు ఉగ్రవాది తరహాలో కేసులు పెట్టడం దారుణమని వాపోయింది.
🏠 Home