🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 03 Jul, 2026 | Page: 1

గుజరాత్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్ ఏర్పాటుకు కుట్ర..

గుజరాత్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్ ఏర్పాటు కోసం ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ చేసిన కుట్ర వెలుగులోకి వచ్చింది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్.. గుజరాత్, మధ్యప్రదేశ్‌లో 8 మందిని అరెస్ట్ చేసింది. గుజరాత్ ఏటీఎస్ అధికారులు గురువారం గుజరాత్‌లోని బనస్కాంత, పటాన్, నవ్‌సారితో పాటు పొరుగు రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లోని దేవాస్ ప్రాంతంలో ఏకకాలంలో దాడులు నిర్వహించి ఈ 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితులను అహ్మద్ గాజీవాలా, ఇబ్రహీం ఘాఘా, ముదస్సిర్ గాజీవాలా, జకారియా దురానీ, ముఫ్తీ ఫౌజాన్ దౌవా, మహ్మద్ అమీన్ పాలన్‌పురి, మహ్మద్ అబ్దుల్ సావ్దీ, బిలాల్ దురానీ ఘాఘాగా గుర్తించారు. వీరిలో ముగ్గురు సిద్ధ్‌పూర్, చిఖ్లీలోని మతపరమైన విద్యాసంస్థలతో సంబంధం ఉన్నట్లు తేలింది. నిందితులంతా జైష్-ఎ-మహ్మద్ సంస్థ తరఫున యాక్టివ్‌గా పనిచేస్తూ.. గుజరాత్ వ్యాప్తంగా తమ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి పని చేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు.
🏠 Home