🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 27 Jun, 2026 | Page: 1

ఓ మనిషి నీసంతృప్తియే నీసంతోషం

మనిషికి కోరికలు అపరిమితం
కోరికలు పోటీ పడతాయి
ఓ మనిషి కోరికల వెంట
పరుగుతీయకు

ఇతరులతో పోల్చుకోకు
కోరికలు తీరక పోతే
కుమిలిపోకు కుంగి పోకు

పక్కవారితో పోల్చుకుని
పోటీ పడకు మానసిక
ప్రశాంతతను దూరం చేసుకోకు

ఆశల వెనుక పరుగులు ఆపేయ్
ఆస్తులు అంతస్తులు పెరిగితే
ఆనందం రాదు
డబ్బు హోదా సంతోషాన్ని ఇవ్వవు
ఎంత సంపాదించిన నీ వెంట
రాదు సంపద కూడబెడితే
సంతోషం నిలవదు

ఉన్నదాంట్లో తృప్తిగా ఉంటే
నీకంటే రాజు ఈలోకంలో
ఎవ్వరు ఉండరు

కోరికలను తగ్గించుకో
మనో నియంత్రణతో
వచ్చిన దాంట్లో
ఆనందాన్ని వెతుక్కో
సంతృప్తి అనేది ఒక పెద్ద వరం
అదినీజీవితానికి అసలైన బలం

ఆశల అలజడినిపక్కన పెట్టు
నీగత జీవితంలోకి తొంగి చూడు
నీదగ్గర ఉన్న దాంట్లో సంతోషాన్ని
వెతుక్కో లేని వాటి కోసం ఆరాటం
వద్దు ఆనందం కోసం ఆర్భాటాలు
వద్దు ఆత్మానందమే హద్దు కావాలి
సంతృప్తి అనే అమృతాన్ని
మనసార ఆస్వాదించు

బాహ్య ప్రపంచంలో దొరికే
గుర్తింపు తాత్కాలికమే
నీఆత్మకు సంతృప్తిని ఇచ్చే
ఆనందమే శాశ్వతమైనది
నీ సంతృప్తియే నీఅసలైన
సంతోషం
నీ ధైర్యమే నీబలం

పసిపిల్లల నవ్వుల్లో
ఉంది సంతోషం
ప్రకృతిని చూసే చూపుల్లో
ఉంది ఆనందం


చిన్న చిన్న పనులు
చేయడంలోనే ఉంది
సంతృప్తి
సాధించిన సక్సెస్
సంతోశాన్ని ఇతరులతో
పంచుకోవడంలోనే ఉంది
ఆనందం

ఎండమావుల కోసం వెతకద్దు
నీనీడలోనే నువ్వు విశ్రాంతి
తీసుకో
మనుషుల మనుసులు
గెలవడం నేర్చుకో
మమతల తోటలో
సంతోషాన్ని పండించుకో

రేపటి గురించి ఆందోళన
పక్కన పెట్టు
ప్రస్తుత కాలంలో మనసారా
జీవించడం నేర్చుకో
భవిష్యత్తును ఊహించకు
గతాన్ని తవ్వకు దుఃఖంలో
కూరుకు పోకు

నీ ఆత్మకు నచ్చినట్లుగా
నువ్వు ఉండు‌
నీమనసుకు నచ్చిన
పనులు చేయు
ఇతరుల ఒత్తిడికి గురికాకు

నీసంతృప్తిలోనే అసలైన
విజయాన్ని చూడు
చిరునవ్వుతో ప్రతిరోజు గడిపేయ్
నీసంతోషాన్ని నువ్వే గెలుచుకో!

సంతోషం అంటే సంతృప్తి పనులు
ఆలోచనలు అనుకున్నది
అనుకున్నట్లుగా చేయగలిగే
స్వేచ్చా వీటి ద్వారా లభించే
తృప్తిని మించిన సంతోషం లేదు

చిరునవ్వుతో ప్రతి రోజు గడిపేయ్
నీసంతోషానికి నీవే కర్త ఖర్మ క్రియా
అనేది తెలుసుకో జాగ్రత్తగా
మసులుకో

ఓమనిషి మానవత్వంతో
మసులుకో మంచిని పెంచి
కరుణ సహనం సౌహర్ధత
సంతోషాల పూతోటలో
హాయిగా ఆనందంగా సాగిపో

నేదునూరి కనకయ్య
కాలమిస్ట్ రచయిత
కరీంనగర్9440245771
🏠 Home