రిజర్వేషన్స్ అమలుతోనే మహిళా సాధికారిత
దేశ జనాభాలో సగ భాగం ఉన్న మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో పోటీ
పడుతూ ఉన్నప్పటికీ చట్టసభలలో
ఓటుబ్యాంకుగ ఉపయోగపడుతూ
చట్టనిర్మాణంలో భాగస్వాములు
కాకపోవడం మహిళల సాధికారత
సాధనకు గొడ్డలిపెట్టు గా పరిణమించింది
ప్రభుత్వం యువతీ యువకుల మధ్య సమానత్వ సాధనకు యువతుల పెళ్ళీడు వయసు21 సంవత్సరాలకు పెంచుతు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లు వల్ల సమానత్వం సాధ్యంకాదు.
చట్ట సభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలి.
మహిళా బిల్లు రాజకీయ పార్టీల ఎన్నికల వాగ్దానంగ మిగిలిపొయింది. మహిళలను ఓటు బ్యాంకుగా ఉపయోగించు కోవడం మహిళా సంక్షేమానికి అడ్డంకిగా పరిణమించింది.
ప్రభుత్వo మహిళలకు చట్ట సభల్లో సీట్లు రిజర్వ్ చేస్తూ చట్టాన్ని అమలు చెయ్యాలి . మహిళలకు పోషకాహార భద్రత కల్పించాలి విద్య, వైద్యం ఉపాధి కల్పనలో పెద్ద పీట వేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోషకాహార సరఫరా పథకంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసినప్పటికీ ఆశించిన మేరకు ఫలితాలు సాధించడంలో విఫలమైనాయి . మహిళా అభివృధి సంక్షేమ పథకాల అమలులో అధికారుల నిర్లక్ష్యం, అవినీతిని, ఉదాసీనతను అరికట్టాలి. పోషకాహార సరఫరా పథకం ఆశించిన ఫలితాలు సాధించలేదు. మహిళలకు ఉచిత వృత్తి విద్య అందించాలి. డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం కంప్యూటర్ ఎడ్యుకేషన్లో శిక్ష ణ సౌకర్యాలు కల్పించాలి. ఉన్నత విద్యలో మహిళలను ప్రోత్సాహించాలి. విద్యారంగం,ఆర్థిక రంగాల్లో రాణించే విధంగా వాతావరణం కల్పించాలి. అన్ని రంగాలలో పురుషులతో పాటు మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి. అప్పుడే ఆర్థిక సమానత్వం సాధ్యమవుతుంది. హక్కుల రక్షణ కొరకు మహిళాకమిషన్స్ ను బలోపేతం చెయ్యాలి. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి సత్వర న్యాయo కోసం సంస్కరణలు చెయ్యాలి. మహిళా సాధికారితకు చట్టసభల్లో మహిళా రిజర్వేషన్సే శరణ్యం. మహిళా రిజర్వేషన్లు కులాల వారిగా,జనాభా ప్రాతిపదికన వర్గీకరణ చేపట్టి చట్టసభల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్స్ వర్తింప చెయ్యాలి. సామాజిక ఆర్థిక పాలనా సంస్కరణలు ప్రవేశ పెట్టి మహిళా సాధికారతకు చేయూత నివ్వాలి.
మహిళా సాధికారత రావాలంటే బాల్యం నుండే ఆడ,మగ పిల్లలను సమానంగా పెంచాలి, సమానావకాశాలు వికల్పించాలి. ఇప్పటికీ స్త్రీ పురుష సమానత రాకపోవడానికి కారణం అమ్మాయిలకు సంపూర్ణ విద్య అందకపోవడం, సమాన అవకాశాలు ఇవ్వకపోవడం ,అబలగా చూడటం, పురుషాధిక్యత, ఎక్కడ స్త్రీలే రాజకీయాలు చేస్తే తమ పెత్త పోతూందనుకోవడం,ధన దాహం అధికార దాహం పురుషాధిక్యత మానవీయ దృక్పథం లేకపోవడం,విలువలకు ప్రాధాన్యత నివ్వకపోవడం, ధనవంతులు పురుషాధిక్యతగల పెద్దలు స్త్రీలకు రాజకీయ రంగములో ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఇవన్నీ మహిళలు వెనుబడటానికీ కారణాలు. రాజ్యాధికారంలో మహిళల భాగస్వామ్యం పెంచడానికి మహిళాబిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి . పార్లమెంట్లో పురుష ఎం.పి లు ఎక్కువ సంఖ్యలో వుండడం తమ అధికారం పోతుందనే భయం ఉంది. భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశించిన ప్రజాస్వామిక న్యాయం సిద్ధించాలంటే చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్స్ బిల్లు అమలుచేస్తేనే మహిళా సాధికారత సాధ్యం అవుతుంది.
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
కరీంనగర్9440245771