🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 26 Jun, 2026 | Page: 1

గిరిజనుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించి 50 సంవత్సరాలు" పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఇతర ప్రజాప్రతినిధులు చేపడుతున్న బస్సు యాత్రలో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండలం, లక్ష్మాపూర్ తండాలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లక్ష్మాపూర్ తండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన పీర్ల పండుగ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
తదుపరి మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, గ్రామంలోని గిరిజనులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ, గిరిజనులకు రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో అవకాశాలు కల్పించే దిశగా ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు.
ఇందిరా గాంధీ నాయకత్వంలో గిరిజనుల సంక్షేమం కోసం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాల వల్ల వేలాది గిరిజన కుటుంబాలకు విద్య, ఉపాధి, సామాజిక అభివృద్ధి అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు.
గిరిజనుల హక్కులు, అభివృద్ధి, ఆత్మగౌరవ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, గిరిజన సంఘాల ప్రతినిధులు, మహిళలు, యువకులు మరియు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు
🏠 Home