ఓటరు నమోదుపై అవగాహన కల్పించిన తెలుగుపల్లి సర్పంచ్ చాట్ల రమాదేవి రాములు
తెలుగుపల్లి గ్రామంలో ఓటరు నమోదు కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సర్పంచ్ చాట్ల రమాదేవి రాములు గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు ఓటరు నమోదు ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ చాట్ల రమాదేవి రాములు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియలో కొత్త ఓటరు ఒక్కరు కూడా మిస్ కాకుండా నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే, మరణించిన వారి పేర్లను ఓటరు జాబితా నుండి తొలగించడం, ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు చోట్ల ఓట్లు ఉన్నట్లయితే, వాటిని ఒకే చోటికి మార్చుకోవడం వంటి మార్పులు చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బి.ఎల్.ఓ సీనియర్ అసిస్టెంట్ అనిల్ కుమార్, ఉప సర్పంచ్ గ్యార వెంకటేష్, జేల్లెల్ల లింగమయ్య, బొడ్డుపల్లి అంజయ్య మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.