🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 26 Jun, 2026 | Page: 1

దేవరకొండలో పుట్టినరోజు వేడుకల సందర్భంగా సేవా కార్యక్రమం: 20వ వార్డులో ఆర్‌వో ప్లాంట్‌ను ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు

20వ వార్డులో ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు తన పుట్టినరోజు పురస్కరించుకొని 20వ వార్డులోని మహిళకు ఆరో ప్లాంట్ ను శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా ఆరవ ప్లాంట్ ను ప్రారంభించి మాట్లాడుతూ దేవరకొండ పట్టణ ప్రజలకు ఐదు రూపాయలకే శుద్ధి జలాలను అందించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. తన పుట్టినరోజున ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు విద్యా సహాయం వైద్య సహాయం తో పాటు నిత్యవసర వస్తువులు అందించడం జరుగుతుందని ఈ సంవత్సరం పేదరాలైనటువంటి మహిళకు ఆరో ప్లాంటు అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండి రైస్, కౌన్సిలర్లు యునుస్, అజయ్ చంద్ర ,సాయి చంద్ర గౌడ్, గుద్దేటి మాధవి సత్యం అంకురి సుమలత రాజేష్, అంకులమ్మ యాదయ్య, కో ఆప్షన్ సభ్యులు నేతల భాగ్యలక్ష్మి శ్రీనివాస్, డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి, వైయస్ కరుణాకర్,మోర అశోక్, నీల హరిబాబు, గందె కృష్ణయ్య, పొన్నె బోయిన సైదులు మాకం సువర్ణ,, మాకం మహేష్, రమేష్, రఘు, పగిడిమర్రి రాధా రాణి, పుష్పమ్మ, సాయినాథ్ రెడ్డి, చేరిపల్లి బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home