జులై 1 నుంచి టీటీసీ ఎగ్జామ్ ఆన్‌లైన్ దరఖాస్తులు..
ఆంధ్రప్రదేశ్‌లో టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (లోయర్ గ్రేడ్) థియరీ పరీక్షలు–2026 నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డాక్టర్ కె.వి. శ్రీనివాసులు రెడ్డి ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు. టీటీసీ (TTC) 42 రోజుల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఆయన పేర్కొన్నారు. వీటితో పాటు గతంలో జరిగిన పరీక్షల్లో ఫెయిల్ అయిన అభ్యర్థులకు కూడా ఈసారి పరీక్షలు రాసేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ఐదు ప్రధాన కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.