16వ వార్డులో సర్ ప్రక్రియ ప్రారంభం..
- పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ శీను, వార్డు కౌన్సిలర్ అల్కూరి పావని..
నారాయణపేట, జూన్ 25 (బీవీకే న్యూస్ )
మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో గురువారం సర్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ శీను స్వయంగా పాల్గొని, సంబంధించిన పత్రాలను బీఎల్వోకు అందించి, సర్ ప్రక్రియ ను ఇంటింటికి ప్రారంభించారు. స్థానిక వార్డు కౌన్సిలర్ అల్కూరి పావని, ఎమ్మార్వో సతీష్ , బిఎల్ఏ లు మరియు నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ శీను మాట్లాడుతూ..
సర్ ప్రక్రియ లో ప్రతి ఒక్కరూ పాల్గొని, అవసరమైన పత్రాలను బీఎల్వోకు అందించాలని సూచించారు. ఓటు హక్కు లేని వారు సైతం సర్ ప్రక్రియ ద్వారా ఈనెల 30 వరకు ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.
సర్ ప్రక్రియ ద్వారా పత్రాలను అందించకపోతే.. ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరూ సంబంధించిన పత్రాలను ఇవ్వాలని సూచించారు.
కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు వల్లంపల్లి లక్ష్మణ్ , మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహమ్మద్ షాలం , స్థానిక నాయకులు రంజాన్ , కాలిద్, బాసిత్ , నాసర్ , రాజశేఖర్ , రాములు, రషీద్, ఆసిఫ్ ,సిబ్బంది,
సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.