నా 7వ వార్డులో పడమటి అంజన్న దేవాలయం, ఈద్గా ఉండడం అదృష్టం
- మంత్రి వాకిటి శ్రీహరిచే పడమటి అంజన్న గాలి గోపుర నిర్మాణానికి శ్రీకారం చుట్టడం సంతోషం
- ప్రార్థన మందిరాలకు సేవ చేసే భాగ్యము లభించడం పూర్వజన్మ సుకృతం
- 7వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ శ్రీ విద్యా నీల గౌడ్
నారాయణపేట, జూన్ 24 (బి వి కే న్యూస్)
నన్ను ఆదరించి గెలిపించుకున్న ఏడవ వార్డు ప్రజలందరికీ నమస్కారాలు. నేడు నా వార్డులో ప్రార్థన మందిరం అభివృద్ధి చేసుకునే అవకాశం నిరంతర శ్రమజీవి అయినా రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిలి శ్రీహరి గారి ఆధ్వర్యంలో శ్రీ పడమటి ఆంజనేయ స్వామి గాలిగోపుర నిర్మాణం జరగడం అలాగే మైనార్టీ సోదరులకు సంబంధించిన ఈద్గా వద్ద ప్రహరీ గోడ బోరు ముఖద్వారం వంటి అభివృద్ధి పనులకు మంత్రిగారు శ్రీకారం చుట్టడం నేను ఎంతగానో సంతోషిస్తున్నానంటూ ఏడవ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ శ్రీవిద్య నీల గౌడ్ అన్నారు. ప్రజల మనసు గెలుచుకొని పదవి అనుభవించడం గొప్ప కాదని వాటికి సార్థకత చేయాలన్న ఆలోచన నేడు అభివృద్ధి అంటే ఏమిటి అని చూస్తున్న మన ప్రియతమ నేత రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర వాకిటి శ్రీహరి ఉన్నంతవరకు భక్తలు పట్టణమే కాదు నియోజకవర్గ మొత్తం ఎంతో అభివృద్ధి జరగక తప్పదని ఆమె అన్నారు. మన ఏడవ వార్డులో పార్టీలు ఏదైనా అందరం కలిసికట్టుగా వార్డు అభివృద్ధి కొరకు పాటుపడేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీవిద్య నీలాగౌడ్ అన్నారు.