🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 23 Jun, 2026 | Page: 1

మోదీ తన స్నేహితుడు ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడం ఆపాలి : కాంగ్రెస్

అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ భారత్‌లో పర్యటిస్తున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విరుచుకుపడింది కాంగ్రెస్​. మోదీ తన 'మంచి స్నేహితుడు' అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడం ఆపాలని చెప్పింది. ప్రస్తుతం భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న ఏ వాణిజ్య ఒప్పందంపైనా సంతకం చేయవద్దని తెలిపింది. ఈ ఒప్పందం వల్ల భారత రైతులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొంది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని తిరస్కరించిన మలేషియా నుంచి మోదీ ప్రభుత్వం స్ఫూర్తి పొందాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ అన్నారు.
🏠 Home