ఓ మనిషి నీ అలవాట్లే ఉన్నత శిఖరాలకు బాట
ఓ మనిషి
నీఅలవాట్లే నిన్ను
ఉన్నత స్థానంలో
నిలుపుతాయి
వేకువనే మేల్కోవడం
మెరుగైన జీవనశైలి
సునిశిత పరిశీలన
దైనందిన పనులపై దృష్టి
ప్రణాళిక బద్ధంగా
పనులు చేయడం
నిర్ణీత కాలంలో
నిర్దేశిత కార్యాలను
పూర్తిచేసే క్రమశిక్షణ
ఉన్నత జీవితానికి
మొదటి మెట్టుకావాలి
ఓ మనిషి నీవు ఎంపిక
చేసుకున్న రంగంలో
పట్టుదలే పెట్టుబడిగా
క్రమం తప్పకుండా సాగే
నిత్య సాధన
నీలో నైపుణ్యానికి
ఆలంబన కావాలి
నీలో ఉత్పాదక శక్తి
సామర్థ్యాలు పెరిగి
ప్రగతి పురోగతి
సిద్ధించి విజయం
నీకు దాసోహమంటుంది
నీ గమ్యం వైపు సాగే పరుగు
ఈ రోజు నీవు చేసే చిన్న పని
రేపు నిన్ను విజేతగా నిలబెట్టే
పెద్ద గెలుపు కావాలి
లక్ష్యసాధనకు నీవు వేసే
అడుగు రేపటి అభివృద్ధికి
వేసే తొలి పునాది కావాలి
మంచి మాటలు మంచి అలవాట్లు
కర్తవ్యనిష్ట సంకల్పబలం
సోమరి తనం వీడి శ్రమిస్తే
నీ నీడ కూడా నిన్ను
మెచ్చుకుంటుంది
లక్ష్య సాధనా సామర్థ్యాలు
మనిషి వ్యక్తిత్వం మర్యాద
ఉన్నత స్థాయిలో రాణించటానికి
దశ దిశను నిర్ణయిస్తాయి
వృక్షోరక్షితి రక్షితః అన్నట్లు
నీ కర్తవ్య నిష్ట కార్యకుశలత
నిన్ను కాపాడుతుంది
నీనీతి నిజాయితీ
నీ జీవనశైలి నీ వైఖరి
క్రమశిక్షణ నిలకడైన అలవాట్లు
నీభవితను మార్చేదివ్యౌషధం
క్రమశిక్షణే నీఊపిరైతే టైం
నీకు దాసోహమంటుంది
నిండు కుండ తొణకదన్నట్లు
నిలకడగా సాగే నీఅలవాట్లే
నిన్ను సమాజంలో శక్తిగా
నిలుపుతాయి
శ్రమయేవజయతే
నీ జీవన శైలి అవుతే కష్టాల
పర్వతం కరిగిపోతుంది
కాలం విలువను తెలిసినవాడు
లోకంలో ఎన్నటికి ఓడిపోడు
చదువు అనేది ఒక నిరంతర
యజ్ఞం విజ్ఞానం వికాసం
వివేకం విచక్షణ విశ్లేషణ
సామర్థ్యాలను పెంచుతుంది
పుస్తకం తెరిస్తే జ్ఞానం వచ్చును
ప్రశ్నించే తత్వమే ప్రగతి నిచ్చును
విద్యను మించిన ధనం లేదు.
దాని దొంగిలించే శత్రువులేడు
క్రమం తప్పని సాధన ఉంటే
లక్ష్యం నీ వశమౌతుంది
ఆలస్యం అనే జబ్బునువదిలితే
గమ్యం నిన్నువెతుక్కుంటూ వస్తుంది
సమయపాలనను నువ్వు
నమ్ముతే ఈ జగత్తు నీకు
దాసోహం అంటుంది
చెడును వదిలి మంచిని
పెంచితేసమాజం నీకు
నీరాజనం పడుతుంది
అలవాట్లే నీ క్యారెక్టర్ (వ్యక్తిత్వం) అవేనీజీవితానికి కండక్టర్
మంచిని నెమరువేస్తూ
సాగిపోతే విజయం సిద్ధిస్తుంది
పరిస్థితులు ఎలా ఉన్నా
నీమంచి అలవాట్లుమారవద్దు
కష్టాలు ఎన్ని వచ్చినా
నీఆశయం వీడొద్దు
ఆశయాల సాధనలో
అలుపెరుగని పోరాటం చేసిన
మహనీయలే చరిత్ర నిర్మాతలైనారు
నీ అలవాట్లే నీ వ్యక్తిత్వానికి
ఆభరణాలు
నీఅలవాట్లే నీకుబలం
అవే నిన్ను ఉన్నత
శిఖరాలకు చేర్చుతాయి
మెరుగైన అలవాట్లతో
మెరుగైన సమాజ నిర్మాణానికి
పౌరసమాజం పూనుకోవాలి
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు తెలంగాణ
ఎకనామిక్ ఫోరం
కాలమిస్ట్ రచయిత
9440245771