🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 20 Jun, 2026 | Page: 1

క్రమశిక్షణతో కూడిన జీవనశైలితో లక్ష్య సిద్ధి సుసాధ్యం - కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి, విశ్రాంత ప్రిన్సిపాల్, కాలమిస్ట్‌, వ్యక్తిత్వ వికాస నిపుణులు

సక్రమమైన క్రమశిక్షణతో కూడిన దిన చర్యను అలవాటు చేసుకోవడం వల్ల ఎంచుకున్న రంగంలో తప్పక రాణించవచ్చని ప్రముఖ వ్యక్తిత్వ వికాస శిక్షకులు, రచయిత, విశ్రాంత ప్రిన్సిపల్ కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ రోజు సెయింట్ జార్జ్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో ఫాతిమానగర్‌ అడోరేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నోట్‌ బుక్స్‌, పెన్స్‌, పెన్సిల్స్‌, స్కూలు బ్యాగులు, స్కూల్‌ యూనిఫామ్స్‌, డ్రస్సులు లాంటి విద్యకు సంబంధించిన ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ
పిల్లలు బాగా చదవాలి నైతిక విలువలతో , క్రమశిక్షణతో కూడిన ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో మంచి పౌరలుగా గుర్తింపు పొందాలని సమయపాలనతో సక్రమంగా కృషి చేసిన విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించడంలో విజయం పొందాతారని అన్నారు. ప్రతి రోజు విధిగా 3 - 4 గంటలు చదవడమ అలవాటు చేసుకోవడం వల్ల జీవితాంతం ఆ సదలవాటు మనల్ని ఉన్నత విద్యావంతులను చేస్తుందని అన్నారు. ఇష్టంతో కష్టపడి చదివి కలెక్టర్, డాక్టర్,ఇంజనీర్, పోలీస్, లాయర్, ఉపాధ్యాయులు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు కావాలని సూచించారు. బలమైన కోరికతో ఇష్టంగా కష్టపడి లక్ష్య సాధనకు కృషి చేయాలని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమములో సెంట్ ఆల్ఫోన్ ప్రిన్సిపాల్ ఫాదర్ సంతోష్, సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సిస్టర్ జిసా, సఖి సెంటర్ అడ్మిస్టేషన్ లక్ష్మీ, సిస్టర్ విజయరాణి, సిస్టర్ జాయిస్, సిస్టర్ అరుణ, సంస్థ ప్రతినిధులు, మర్రి మల్లేశం, నరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రూప, రమేష్, స్రవంతి, మౌనిక, సరిత, జమున, విజయ, గంగాలతో పాటు 150 పిల్లలు, వారి తల్లి దండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫాతిమా నగర్ అడోరేషన్ సొసైటీ ఆధ్వర్యంలో 105 మంది బాల బాలికలకు 4 లక్షలకు పైగా విలువైన నోట్ బుక్స్, డ్రెస్, బ్యాగ్స్, పెన్స్,పెన్సిల్, స్కేల్, ఎరైజర్, చాక్ మార్స్ లాంటి విద్యా సంబంధ వస్తువులను ముఖ్య అతిథి డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డితో పాటు ఇతర అతిథులు ‌ ప్రదానం చేయడం జరిగింది.
🏠 Home