🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 20 Jun, 2026 | Page: 1

శారీరక మానసిక ఆరోగ్యానికి దివ్య ఔషధం యోగ

హైటెక్ యుగంలో ఉరుకుల పరుగుల జీవితంలో నిరంతరం కాలంతో పోటీ పడుతున్న మానవుని జీవితంలో శరీరము మనసు తీవ్ర ఒత్తిడికి గురౌతుంది . ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే దివ్యౌషధం యోగ . యోగాను ప్రపంచ దేశాలకు భారతదేశం పరిచయం చేసింది .క్రీస్తు పూర్వం పతంజలి మహర్షి యోగ ను అభివృద్ధి చేసి ప్రపంచానికి అందించాడు. భారతదేశం నుంచి ఉద్భవించిన జైన' బౌద్ధ ' హిందూ మతంలో యోగాకు ఒక ప్రత్యేక స్థానం కల్పించారు.20వ శతాబ్దం అనంతరం ఆరోగ్యపరిరక్షణలో యోగ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.యోగ అభ్యసించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచానికి భారత్ అందించిన అద్భుతాలలో యోగా ఒకటి. మనిషి శారీరక 'మానసిక ప్రశాంతతకు ఆరోగ్యానికి యోగ ఎంతగానో దోహదపడుతుంది.నేడు ప్రపంచ వ్యాప్తంగా అన్నిదేశాలు యోగాను పాటిస్తున్నాయి. ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన ఘనత భారతదేశానికి ఉంది కావున భారతదేశం ప్రపంచానికి గురువుగా గుర్తింపు పొందడం గమనార్హం.
యోగ మన ప్రాచీన సంస్కృతి వారసత్వం యోగ అన్న పదం సంస్కృతంలోని యజ అనే పదము నుండి పుట్టింది. యజ అనగా దేనినైనా ఏకం చేయగలమని అర్థం. ఆసనం అంటే భంగిమ ఈరెంటిని యోగాసనాలు అంటారు. మనసు శరీరాన్ని ఏకం చేసి ఆద్యాత్మిక తాదాత్మ్యం అందించేది.శరీరం మనసు
ఆత్మలో చేయడం మరియు జ్ఞానోదయమైన అవగాహన సాధించడం.
యోగ చరిత్ర యోగ వేదకాలం నుండే యోగ వుందని పురాణాలు చెబుతున్నాయి.
యోగకు 2000‌యేళ్ల చరిత్ర వుంది. మన దేశ సాంస్కృతిక ప్రాచీన వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది.కానీ ఆనాటి రోజుల్లో యోగ కొన్నివర్గాలకేపరిమితమైంది .ఋషులు ఆశ్రమాలలో వున్న శిష్యులకు మాత్రమే యోగ అభ్యసనఅధ్యయనప్రక్రియను పరిమితం చేశారు.
నరేంద్ర మోడీ యోగ ప్రాధాన్యత నరేంద్రమోడి గారు భారత ప్రధాన మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత యోగాకు పెద్దపీట వేశారు.
ప్రపంచ మానవాళి "అనారోగ్యం నుండి ఆరోగ్యం వైపు వెళ్లేందుకు యోగాయే ఉత్తమ మార్గమని" పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు 2014 సెప్టెంబర్ 27 న ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో యోగ ప్రాధాన్యం గురించి ప్రసంగించి ప్రపంచ దేశాలను యోగ ప్రాధాన్యతను గుర్తించే విధంగా చేసిన ప్రతిపాదనను డిసెంబర్ 11 2014 న ఐక్య రాజ్యసమితిఆమోదించింది.ప్రధాన మంత్రి చొరవతో ప్రతి యేటా జూన్ 21 న అంతర్జాతీయయోగదినోత్సవం నిర్వహించాలని యు'ఎన్ 'ఓ(UNO) నిర్ణయించింది.
అంతర్జాతీయ యోగా దినోత్సవ తీర్మానాన్ని 193 దేశాలు సమర్థించాయి .నాటి నుండి ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయయోగాదినోత్సవం జరుపుకుంటారు.
2023 యోగ దినోత్సవం థీమ్
వసుదైక కుటుంభం కోసం యోగ అనే ఇతివృత్తంతో " ఇది ఒకే భూమి ఒకే కుటుంభం మరియు ఒక భవిష్యత్తు కోసం యోగానికి మానవత్వాన్ని జోడించి యోగను మరింత మందికి చేరువ చేయాలన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్ష అభినందనీయం. యోగ తత్వం మానవత్వం అనే సద్భావన ప్రతి ఒక్కరిలో కలుగ చేయడం
జూన్ 21.న న్యూయార్క్ లోని ఐ'రా'స సమితి ప్రధాన కార్యాలయం నుండి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గారు అంతర్జాతీయ యోగ వేడుకలకు నాయకత్వం వహిస్తారు.
మధ్య ప్రదేశ్ లోని జబల్ పూర్ నుండి మన దేశంలో అంతర్జాతీయ యోగ వేడుకలు భారత ఉప రాష్ట్రపతి జగదీష్ దన్కర్ అధ్యక్షత వహిస్తారు. కనీసం 25 కోట్ల మంది హాజరు అవుతారని అంచనా.
ఈరోజు జరిగే వేడుకల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా యోగ ప్రాచుర్యం పెరుగుతోంది. చాలా దేశాల్లో యోగ అభ్యసించే వారి సంఖ్య క్రమ క్రమంగా పెరగడం గమనార్హం. వివిధ వ్యాయామాల ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం పొందవచ్చు .యోగలో ఒక భాగమైన హఠయోగ నేర్చుకుంటే వందల యేళ్లు బతుకవచ్చును అని వైద్య 'ఆరోగ్య అద్యయనాలు తెలుపుతున్నాయి. పహారిబాబా నుండి స్వామి వివేకానంద వరకు హఠయోగ నేర్చుకునేందుకు తీవ్రంగా కృషి చేశారు.

2026 వ సంవత్సరం థీమ్ ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే థీమ్ తో ఈసారి దేశంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం నిర్వహిస్తున్నారు.
వృద్ధాప్యంలో కీళ్లు నొప్పులు తగ్గించి శరీర సమతుల్యత
ఫ్లెక్సీ బిలిటీ మేరుగుపరచడం
వయసుతోపాటు వచ్చే ఒత్తిడి ఆందోళన దూరం చేసి మానసిక ఉల్లాసాన్ని పెంచడం. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల తీవ్రత తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచడం .వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్త్ ఏజింగ్ (2021_ 2030)లక్ష్యాలకు
మద్దతుగా నిలవడం.
ఈ ఏడాది యోగ జాతీయ వేడుకలు పశ్చిమబెంగాల్ లోని కలకత్తా రెడ్ రోడ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఐక్య రాజ్య సమితి ఆధ్వర్యంలో సుమారు 200 కంటే ఎక్కువ దేశాల్లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
కరోనా నియంత్రణ యోగ కరోనా కాలంలో యోగ సాధన అవసరం ప్రాదాన్యతనత పెరిగింది
శ్వాస కోశ ఇబ్బందులను అధిగమించడానికి యోగ ఉత్తమ సాధనం…
🏠 Home